IMD: దక్షిణ కోస్తాలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు: ఐఎండీ

ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీర ప్రాంతాలైన పుదుచ్చేరి, కరైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లోకి ఇవాళ రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది.

Updated : 29 Oct 2022 16:22 IST

హైదరాబాద్‌: ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీర ప్రాంతాలైన పుదుచ్చేరి, కరైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి ఇవాళ రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పం మీద దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయిల్లో ఉన్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఇవాళ కింది స్థాయి  గాలులు ముఖ్యంగా ఈశాన్య.. తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలైనట్లు తెలిపింది. తమిళనాడు, ఏపీలోని తిరుమల ప్రాంతాల్లో వార్షిక వర్షపాతం ఎక్కువ శాతం ఈశాన్య రుతుపవనాల ద్వారానే నమోదవుతుంది.  ఈ రుతుపవనాలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగే అవకాశముంది. 

తెలంగాణలో తగ్గిన చలి..

మరోవైపు తెలంగాణలో గత వారం రోజులుగా వణికిస్తున్న చలి కాస్త తగ్గుముఖం పట్టినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని