Telangana News: సెర్ప్‌ ఉద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్‌ నుంచి పేస్కేలు అమలు

గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్కేలు వర్తింపజేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పేస్కేలు అమలు కానుంది.

Updated : 18 Mar 2023 22:13 IST

హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన స్కేలు వర్తింపజేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా సెర్ప్‌ ఉద్యోగులకు పేస్కేలు ప్రకటిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

సెర్ప్ ఉద్యోగులకు కనీస స్కేలు 19,000-58850, గరిష్ఠ స్కేలు 51,320-1,27,310 వర్తించనుంది. సంస్థలోని 3,972 మంది ఉద్యోగులకు పేస్కేలు అమలు కానుంది. పేస్కేలు అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.58 కోట్ల మేర భారం పడనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పేస్కేలు అమలు కానుంది. పేస్కేలు వర్తింపజేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని