SCR: భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ

Published : 10 Jan 2022 01:46 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను భారీగా పెంచింది. పెంచిన ధరలను ఈనెల 20వ తేదీ వరకు అమలు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ వెల్లడించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.10 నుంచి రూ.50వరకు పెంచామన్నారు. నాంపల్లి, కాచిగూడ, వరంగల్‌, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్‌, మహబూబ్‌నగర్‌, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్‌, తాండూర్‌, బీదర్‌, బేగంపేట్‌ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.20వరకు పెంచామన్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని