ఈ బర్గర్ ధర రూ.4.42 లక్షలు..!
సాధారణంగా బర్గర్ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా బర్గర్ తినాలనిపిస్తే ఏ బేకరీకో వెళ్లి దర్జాగా ఆర్డరిస్తాం. బేకరీ స్థాయిని అనుసరించి బిల్లు మహా అయితే.. రూ.50 నుంచి 200 వరకు అవుతుంది. కానీ ఈ బర్గర్ తినాలంటే జేబులు ఒకసారి తడుముకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ ఒక్క బర్గర్ ధర అక్షరాలా రూ.4.42 లక్షలు. ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన బర్గర్‌గా దీని తయారీదారులు చెప్పుకొంటున్నారు. ఈ బర్గర్‌ను నెదర్లాండ్స్‌లోని డే డాల్టన్ రెస్టారెంట్లో పని చేస్తున్నరాబర్ట్ జాన్ డీ వీన్ అనే చెఫ్ తయారు చేశారు. దీనికి ‘గోల్డెన్ బాయ్’గా నామకరణం చేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. అంతే.. ఆహార ప్రియులంతా దీనివైపు లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ బర్గర్ తయారీలో ఖరీదైన బెలూగా కేవియర్, పెద్ద సముద్రపు పీత, కుంకుమ పువ్వు, వాగ్యు బీఫ్, పంది మాంసం, అరుదైన రకం తెల్లటి పుట్టగొడుగులు, చీజ్ వినియోగించినట్టు తయారీదారులు చెప్పుకొచ్చారు. వీటితో పాటు ప్రపంచంలో ఖరీదైన సివెట్ కాఫీ గింజలతో తయారు చేసిన బార్బెక్యూ సాస్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ బర్గర్లో ఖరీదైన డామ్ పెరిగ్నాన్ షాంపేన్‌తో తయారు చేసిన బన్ను వాడారు. ఆ బన్‌లపై బంగారు ఆకులతో అలంకరించారు. తయారీలో ఇన్ని ఖరీదైన పదార్థాలు వాడినందుకే ఈ బర్గర్ ధర రూ.లక్షల్లో ఉంది. దీనిని విక్రయించగా వచ్చిన సొమ్మును ఏదైనా ఎన్జీవోకు దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వీన్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు