Published : 16 Aug 2022 01:08 IST

Chandrababu: విజన్-2047.. చంద్రబాబు చేసిన 10 సూచనలివే!

గుంటూరు: ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగ ఫలితమే దేశ స్వాతంత్ర్యం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమరయోధుల స్ఫూర్తితో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పేదప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలనే ఆశయంతో ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అదే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. నదుల అనుసంధానం దేశ చిరకాల వాంఛ అని.. అందుకోసం కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. డిజిటల్‌ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదని.. అవినీతి ఉన్న చోట అభివృద్ధి ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు.

దిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో తాను చేసిన సూచనలను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చంద్రబాబు ప్రజలకు వివరించారు. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 లక్ష్యాలపై ప్రత్యేకమైన విజన్‌తో ప్రభుత్వాలు పని చేయాలని చేసిన సూచనలను ప్రజలతో పంచుకున్నారు.

* రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

* విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.

* బలమైన యువశక్తి ఉన్న దేశం భారత్. కాబట్టి యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి. దేశంలో సంపద సృష్టి జరగాలి. ఆ సంపదను పేద ప్రజలకు పంచాలి.

* రైతుల కోసం ప్రత్యేకమైన విధానాలు రూపొందించాలి. 75 ఏళ్ల తరువాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు.

* విద్య, ఆరోగ్యం అందరికీ చేరువ కావాలి. దేశ నిర్మాణంలో ఇది ఎంతో కీలకం.

* మహిళా సాధికారతకు ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

* దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఏపీలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేశాం. కరవు రహిత దేశం కోసం నదుల అనుసంధానం జరగాలి.

* అవినీతి లేని పాలనను అందించాలి. సాంకేతికత ద్వారా అవినీతిని అంతం చేయాలి.

* రానున్న 25 ఏళ్లలో అగ్ర దేశంగా భారత్ అవతరించడానికి ప్రణాళికలు రచించాలి. అన్ని అర్హతలు, వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నంబర్‌ 1 కావాలి.

* ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో, ప్రణాళికతో పని చేసి దీన్ని సుసాధ్యం చేసేలా తోడ్పాటు అందించాలి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని