Postal jobs: తపాలా శాఖలో 40,889 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే?

తపాలా శాఖ (Postal Jobs) భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మార్కులను ఆధారంగా తీసుకొని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

Published : 28 Jan 2023 01:20 IST

దిల్లీ: పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central government Job) పొందే అవకాశం మీకు ఉన్నట్టే. తపాలా శాఖ (Indian post)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ (Job notification) వచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్ (ABPM)‌ / డాక్‌ సేవక్‌ (Dak sevak) ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు

  • ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తపాలా శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
  • యూపీలో గరిష్ఠంగా 7,989 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. తమిళనాడులో 3167; కర్ణాటకలో 3036; కేరళలో 2462 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తంగా 40,889 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
  • జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16వరకు  దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొనేందుకు ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు అవకాశం కల్పించారు.
  • ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి.
  • పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి.
  • ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. 
  • బీపీఎం ఉద్యోగాలకు వేతనం రూ.12 వేలు నుంచి గరిష్ఠంగా రూ.29,380; ఏబీపీఎం / డాక్‌సేవక్‌కు రూ.10వేలు నుంచి గరిష్ఠంగా రూ.24,470 మధ్య చెల్లిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు దరఖాస్తు రుసుం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చొప్పున చెల్లించాలి.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని