భవిష్యత్తుపై భరోసా కల్పించాం: జైశంకర్‌

దేశంలో కరోనా తొలిదశలో భారత్‌ సిద్ధంగా లేనప్పటికీ త్వరితగతిన అప్రమత్తమై ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు.

Published : 16 Nov 2020 20:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా తొలిదశలో భారత్‌ సిద్ధంగా లేనప్పటికీ త్వరితగతిన అప్రమత్తమై ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్ ఆఫ్‌ బిజినెస్‌ ఆన్‌లైన్‌లో డక్కన్‌ డైలాగ్‌ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం పీపీఈ కిట్లు, టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు దేశంలో తగినంతగా ఉత్పత్తి కాకపోయినా ప్రస్తుతం డిమాండ్‌ కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నామని జైశంకర్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూసేందుకు సహాయపడతామని ఐరాసకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని