Indian Air Force: అబ్బురపరిచే విమాన విన్యాసాల చిత్రాలు చూశారా?
భారత వాయుసేన (ఐఏఎఫ్) ఈనెల 8వ తేదీన (శుక్రవారం) 89వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ పెరేడ్ రిహార్సల్స్.. ఈ అబ్బురపరిచే విమాన విన్యాసాలకు వేదికైంది.
89వ వార్షికోత్సవం సందర్భంగా రిహార్సల్స్‌లో తీసిన చిత్రాలివి
దిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఈనెల 8వ తేదీన (శుక్రవారం) 89వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ పెరేడ్ రిహార్సల్స్.. ఈ అబ్బురపరిచే విమాన విన్యాసాలకు వేదికైంది. ఇందుకు సంబంధించిన నాలుగు ఫొటోలను ఐఏఎఫ్ ట్విటర్లో పంచుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శుక్రవారం ఘనంగా 89వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.00 గంటలకు AN-32 విమానం నుంచి ఫ్లాగ్ బేరింగ్ స్కై డైవర్స్ డ్రాప్ అవుట్ అవ్వడంతో ప్రదర్శన ప్రారంభమవుతుంది. అనంతరం.. ఫ్లైపాస్ట్ లో హెరిటేజ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఆధునిక ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తో ప్రదర్శన కొనసాగుతుంది.
దిల్లీ, ఘజియాబాద్ ప్రజలకు ఇదే మా విన్నపం: భారతవాయుసేన
ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని భారతవాయుసేన.. దిల్లీ, ఘజియాబాద్, పరిసర ప్రాంతాల ప్రజలను కోరింది. అదేంటంటే.. సాధారణంగా పక్షులు ఎగురుతున్నప్పుడల్లా విమానాలకు తీవ్రమైన ముప్పు ఉంటుంది. ముఖ్యంగా కిందిస్థాయిలో విమానాలు తిరుగుతున్నప్పుడు ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. బహిరంగంగా విసిరిన ఆహారాలు పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులు ఎక్కువ తిరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని దిల్లీ, ఘజియాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తినుబండారాలు కానీ, చెత్తచెదారాన్ని బహిరంగంగా వేయొద్దని భారత వైమానిక దళం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్