9 ఏళ్ల బుడతడు.. గిన్నిస్‌ రికార్డుకెక్కాడు!

హులా-హూపింగ్‌ ఆట తెలుసా? అదేనండీ ఒక రింగును నడుము చుట్టూ ఆపకుండా, కింద పడకుండా తిప్పుతుంటారు. చూడటానికి సులువుగానే అనిపించినా.. రింగును కిందపడకుండా తిప్పడం చాలా కష్టం. అలాంటిది

Updated : 17 Jun 2021 12:14 IST


(Photo: guinnessworldrecords)

చెన్నై: హులా-హూపింగ్‌ ఆట తెలుసా? అదేనండీ ఒక రింగును నడుము చుట్టూ ఆపకుండా, కింద పడకుండా తిప్పుతుంటారు. చూడటానికి సులువుగానే అనిపించినా.. రింగు కిందపడకుండా తిప్పడం చాలా కష్టం. అలాంటిది 9ఏళ్ల బాలుడు రింగును కిందపడకుండా తిప్పడమే కాదు, దాన్ని తిప్పుకుంటూ 50 మెట్లు ఎక్కి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించాడు. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఆదవ్‌ సుగుమార్‌ ఈ ఘనత సాధించాడు. కుమరన్‌ కుంద్రం దేవాలయంలో 50 మెట్లను రింగు తిప్పుతూ 18.28 సెకన్లలో ఎక్కేశాడు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన ఆశ్రిట ఫ్యూరమన్‌ అనే వ్యక్తి పేరుతో ఉంది. 2018లో అతడు 23.39 సెకన్లలో 50 మెట్లు ఎక్కి రికార్డు సృష్టించాడు. ఫ్యూర్‌మన్‌ రికార్డును ఇటీవల సుగుమార్‌ బద్దలుకొట్టాడు. ఈ రికార్డు సాధించడానికి రెండు నెలలు సాధన చేశాడట. పరిగెడుతూ హులా హూపింగ్‌ చేస్తూ రికార్డు కొట్టడమే తన తదుపరి లక్ష్యమని తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని