మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్‌

భారత మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దేవెగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Published : 31 Mar 2021 14:46 IST

బెంగళూరు: భారత మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దేవెగౌడతో పాటు ఆయన సతీమణి చెన్నమ్మకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నాకు, నా సతీమణి చెన్నమ్మకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మా ఇద్దరితో పాటు ఇతర కుటుంబసభ్యులమంతా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాం. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జేడీఎస్‌ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎలాంటి దిగులు చెందవద్దని కోరుతున్నా’ అని దేవెగౌడ ట్వీట్‌లో పేర్కొన్నారు. దేవెగౌడకు కరోనా సోకిందని సమాచారం అందుకున్న ప్రధాని మోదీ వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి దంపతుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని