Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏపీకి చెందిన వారి వివరాలివే..
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమర్‌లో 39 మంది, సంత్రగచిలో ఆరుగురు, ఖరగ్‌పూర్‌లో ముగ్గురు రైలు ఎక్కినట్లు అధికారులు తెలిపారు.

దిల్లీ: ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 178 మంది ఆంధ్రప్రదేశ్‌కు చేరాల్సిన ప్రయాణికులు ఉన్నారు. 1AC - 9, 11 AC - 17, 3A - 114, స్లీపర్ క్లాస్‌లో 38మంది ప్రయాణించారు.
విజయవాడలో దిగాల్సిన వారు 33 మంది ఉండగా.. ఏలూరులో దిగాల్సిన వారు ఇద్దరు.. తాడేపల్లి గూడెంలో ఒకరు, రాజమహేంద్రవరంలో దిగాల్సిన వారు 12 మంది ఉన్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి చెందిన ప్రయాణికుల ఫోన్ నంబర్లు, ప్రయాణించిన కోచ్, బెర్తుల వివరాలను విజయవాడ స్టేషన్‌లోని హెల్ప్ లైన్ కేంద్రానికి అధికారులు పంపారు.
విజయవాడ మీదుగా వెళ్లే 21 రైళ్ల రద్దు
ఒడిశా రైలు ప్రమాద నేపథ్యంలో విజయవాడ మీదుగా ఇవాళ, రేపు నడిచే 21రైళ్లును అధికారులు రద్దు చేశారు. మరో 11 రైళ్లను దారి మళ్లించారు. దీంతో వచ్చి వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!
-
ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు