స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల సంపద

భారతీయులు దాచుకున్న సంపద అత్యధికంగా 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాన్స్ లుగా ఉన్నట్లు తెలిపింది

Published : 18 Jun 2021 14:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద మరోసారి భారీగా పెరిగినట్లు ఆ దేశ జాతీయ బ్యాంకు ఎస్‌ఎన్‌బీ పేర్కొంది. దాదాపు 20 వేల 700 కోట్ల రూపాయలు స్విట్జర్లాండ్‌ల్లోని బ్యాంకుల్లో దాచుకున్నట్లు వెల్లడించింది. 2019లో 6 వేల625 కోట్ల రూపాయలుగా ఉన్న భారతీయుల సంపద ఆమాంతం పెరిగినట్లు వివరించింది. 2011 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. భారతీయులు దాచుకున్న సంపద అత్యధికంగా 2006లో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాన్సులుగా ఉన్నట్లు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని