ఇగ్లూ కేఫ్‌: మంచు హోటల్లో వేడి ఆహారం

ఇగ్లూ కేఫ్‌లో, మంచు గడ్డ టేబుల్‌ మీద వేడి వేడి ఆహారం

Updated : 30 Jan 2021 05:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా కాలంలో కుదేలైన అనేక రంగాల్లో పర్యాటకం కూడా ఉంది. మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అసలు బయటకు రావటానికే భయపడుతున్న ప్రజలను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్‌, గుల్‌మార్గ్‌లో ఓ ప్రత్యేకమైన కేఫ్‌ను గురించిన వివరాలు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారాయి. దీనిని స్థానిక కొలాహోయి స్కీ రిసార్ట్‌ యాజమాన్యం.. తమ హోటల్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసింది.

మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అతిశీతల ప్రాంతాల్లో.. ఎస్కిమోలు అనే స్థానిక ప్రజలు నివసించే మంచు గృహాలను ఇగ్లూ అంటారనే సంగతి తెలిసిందే. యథాలాపంగా నిర్మించటం కాకుండా.. ఇగ్లూలను ప్రత్యేక ఇంజనీరింగ్‌ నియమాల ప్రకారం రూపొందించాల్సి ఉంటుంది. కాగా, మనదేశంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ‘ఇగ్లూ కేఫ్‌’ కూడా మంచు మయం అని చెప్పొచ్చు. ఇక లోపలికి వెళ్తే టేబుళ్ళు, కుర్చీలే కాకుండా అలంకరణకు వాడే వస్తువులు, ఫ్లవర్‌ వాజ్‌, టేబుల్‌ వంటి నిర్మాణం కూడా మంచుతోనే ఏర్పాటు చేశారు. ఐతే, కూర్చునేందుకు అసౌకర్యం కలగకుండా దట్టమైన రగ్గు వంటి వస్త్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇగ్లూ కేఫ్‌లో, మంచు గడ్డ టేబుల్‌ మీద వేడి వేడి ఆహారం తినాలంటే చలో కశ్మీర్‌ అనాల్సిందే. మరి ఆ అనుభం ఎలా ఉంటుందో..  ఈ వీడియోలో మీరూ చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని