Updated : 21 Dec 2021 04:26 IST

యూట్యూబ్‌ వీడియోలు చూసి భార్యకుఇంట్లోనే డెలివరీ..శిశువు మృతి!

చెన్నై: తమిళనాడులోని రాణిపేట్‌ జిల్లాలో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి యూట్యూబ్‌ వీడియోలు చూసి, భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు. ఫలితంగా మృత శిశువును ప్రసవించిన ఆమె.. తీవ్ర రక్తస్రావంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. పానపక్కం ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్నాళ్లకు భార్య (28) గర్భం దాల్చింది. నెలలు నిండటంతో డిసెంబర్ 18న ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లే బదులు.. ఇంట్లోనే బిడ్డను ప్రసవించేలా చేయాలనుకున్నాడు.

ఈ క్రమంలో యూట్యూబ్‌ వీడియోలు చూడటంతోపాటు సోదరిని అడిగి తెలుసుకున్నాడు. చాలా సేపటికి ఆమె ప్రసవించగా.. బిడ్డ చనిపోయింది. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఉప వైద్యాధికారి మణిమారన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఇంకా ఎవరిపై కేసు నమోదు చేయలేదని చెప్పారు. భార్య అనుమతితోనే అతడు డెలివరీ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వెల్లడించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని