కృష్ణా నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ముందుజాగ్రత్త ....

Updated : 28 Sep 2020 16:57 IST

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి పెరుగుతోంది. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారని.. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.అందరూ అక్కడికి వెళ్లాలని సూచించారు.

ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతేమొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి తోడుగా కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి,  చిర్రావూరు, దుగ్గిరాల మండలం, పెద్ద కొండూర్లలో వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. వాగు వరదలను దృష్టిలో పెట్టుకొని అధికారులు మోటార్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి వదిలిపెట్టారు. దీంతో పంటపొలాల్లో నీరు కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరద ఉద్ధృతికి విజయవాడ కృష్ణలంకలో ఇళ్లు నీటమునిగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని