కోకాకోలా మొదట్లో మెడికల్‌షాపుల్లోనే దొరికేది..
ఇంట్లో శుభకార్యం జరిగినా.. నలుగురు కలిసి కూర్చున్నా కూల్‌డ్రింక్స్ తాగడం సంప్రదాయంగా మారిపోయింది. ఇక సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో కూల్‌డ్రింక్ కొని తాగకపోతే సినిమా చూసినట్లుగానే ఉండదు. అంతలా కూల్‌డ్రింక్స్ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాయి. వీటిని ఎక్కువగా
ఇంట్లో శుభకార్యం జరిగినా.. నలుగురు కలిసి కూర్చున్నా కూల్‌డ్రింక్స్ తాగడం సంప్రదాయంగా మారిపోయింది. ఇక సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ సమయంలో కూల్‌డ్రింక్ కొని తాగకపోతే సినిమా చూసినట్లుగానే ఉండదు. అంతలా కూల్‌డ్రింక్స్ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాయి. వీటిని ఎక్కువగా తయారు చేస్తున్న కంపెనీల్లో కోకాకోలా ఒకటి. పలు బ్రాండ్‌పేర్లతోపాటు కోకాకోలా పేరుతోనూ కూల్‌డ్రింక్స్‌ను తయారు చేస్తుంటుంది. ఇప్పుడు కిరాణాషాపుల్లో, బేకరీల్లో, మాల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ లభిస్తున్న కోకాకోలా.. తొలినాళ్లలో కేవలం మెడికల్ షాపుల్లో ఔషధ గుణాల సోడాలా లభించేది. ఆశ్చర్యంగా ఉంది కదా..! నిజానికి కోకాకోలాను ఔషధంగానే తయారు చేశారు. ఆ తర్వాతే కూల్‌డ్రింక్‌గా మారి అందరికి అందుబాటులోకి వచ్చింది. అసలు కోకాకోలా చరిత్రేంటో తెలుసుకుందామా...
అమెరికా సివిల్‌వార్‌లో గాయపడిన జార్జియాకు చెందిన సైనికాధికారి జాన్ పెంబెర్టన్.. మార్ఫిన్ అనే నొప్పి నివారణ మందును వేసుకునేవాడు. అయితే ఎక్కువ వాడకం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన పెంబర్టన్ దీనికి ప్రత్యామ్నాయం కనిపెట్టాలని భావించాడు. దీంతో సైనికాధికారి కాకముందు వైద్య విద్యను అభ్యసించిన అతడు కోకైన్‌తో తయారు చేసిన కోకావైన్ అనే మద్య పానీయాన్ని స్ఫూర్తిగా తీసుకొని 1885లో ‘పెంబెర్టన్ ఫ్రెంచ్ వైన్ కోకా’ను తయారు చేశాడు. ఇందులో కోకావైన్‌తోపాటు ఆఫ్రికాలో లభించే కోకా పువ్వు నుంచి సేకరించిన కోకా నట్‌ను కలిపాడు. అప్పటికి అది మద్యపానీయంగానే ఉండేది.
అయితే 1886లో అట్లాంటా.. జార్జియాలోని ఫుల్టాన్ కౌంటీ మద్యపానం తయారీని నిషేధించడంతో పెంబెర్టన్ ‘కోకా-కోలా’ పేరుతో సోడా తయారుచేశాడు. ఆ సమయంలో మద్యనిషేధంపై ఉద్యమాలు జరుగుతుండటంతో ఈ కోకాకోలా అమ్మకాలు పెరిగాయి. మద్యం తాగడం మానేయాలనుకునేవారికి ఇదో ప్రత్యామ్నాయంగా కనిపించింది. అంతేకాదు.. ఈ సోడా అనేక రోగాలు నయం చేస్తుందని, మత్తుమందు బానిసత్వం నుంచి బయటపడేస్తుందని, నరాల నొప్పి, తలనొప్పిని నివారిస్తుందని పెంబెర్టన్ ప్రచారం చేశాడు. తాను తయారు చేసిన కోకా-కోలా సోడాకు పెటెంట్ కూడా సంపాదించాడు. మొదట్లో వీటిని కేవలం మెడికల్ షాపుల్లోనే అమ్మేవారు. ఐదు సెంట్లకు ఒక గ్లాస్ చొప్పున కోకా కోలా సోడా లభించేది. ఆ తర్వాత పలువురు వ్యాపారవేత్తలతో కలిసి పెంబెర్టన్ కోకాకోలా వ్యాపారం మొదలుపెట్టాడు.
కోకా కోలా కంపెనీ స్థాపన
అయితే, 1888లో అసా గ్రిగ్స్ కాండ్లర్ అనే వ్యాపారవేత్త పెంబెర్టన్ తయారు చేసిన కోకాకోలా రెసిపీని కొనుగోలు చేశాడు. అప్పట్లోనే 2,300డాలర్లకు పెట్టి కొన్నాడని చరిత్రకారులు భావిస్తున్నారు. అది ఎంత వరకు వాస్తవం అనేది తెలియదు. కానీ, కోకాకోలా తయారీ.. రెసిపీ హక్కులు సొంతం చేసుకున్న కాండ్లర్ 1892లో ‘కోకా-కోలా కంపెనీ’ స్థాపించాడు. 1895నాటికి అమెరికా వ్యాప్తంగా ఈ కూల్‌డ్రింక్ వ్యాపారాన్ని విస్తరించాడు. 1899లో ఈ కంపెనీ కోకాకోలాను విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఈ పానీయం శారీరక నొప్పులు, మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుందని కంపెనీ ప్రచారం చేసింది. కాండ్లర్ 1903లో కోకాకోలా రెసిపీలో భాగమైన కోకైన్ పదార్థాన్ని వాడటం ఆపేశాడు. 1915లో కోకాకోలా కోసం రూట్ గ్లాస్ కో అనే సంస్థ ఐకానిక్ కోకాకోలా బాటిల్‌ను రూపొందించింది. ఆ సమయంలో కోకాకోలా కూల్‌డ్రింక్స్ అమ్మకాలు విపరీతంగా జరిగేవి. 1917లో కూల్‌డ్రింక్ రెసిపీలోని కెఫిన్ ను 50శాతం తగ్గించేసి అందరు.. అన్ని వేళలా తాగే విధంగా సాధారణ శీతల పానీయంగా తయారు చేయించాడు కాండ్లర్. అతడి తర్వాత కోకాకోలా సంస్థ బాధ్యతలు వారి వారసులు స్వీకరించారు.
1985లో కోకాకోలా ఫార్ములా మార్చి.. కొత్త కోక్‌ను తయారు చేశారు. అప్పటి కోకాకోలాతోపాటు న్యూకోక్‌ను మార్కెట్లోకి తెచ్చారు. అయితే దానికి ప్రజల ఆదరణ లభించకపోవడంతో 1992లో ఉత్పత్తి నిలిపివేసి.. పాత ఫార్ములాతోనే కూల్‌డ్రింక్స్ తయారు చేశారు. ప్రస్తుతం కోకాకోలా 200కుపైగా దేశాల్లో 500 రకాల బ్రాండ్ల పేర్లతో, 4,700 రకాల రుచులతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఏడు లక్షలమందికిపైగా ఉపాధి కల్పిస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి
-
Movies News
Rana-Naga Chaitanya: ‘మాయాబజార్’ వెబ్‌సిరీస్ కోసం రానా-నాగచైతన్య!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో ఆసీస్‌దే గెలుపు.. సిరీస్ కైవసం
-
General News
Vijayawada: న్యాయవాదిపై కేసు.. భవానీపురం సీఐను వీఆర్‌కు పంపిన సీపీ
-
India News
QR Code: సమాధిపై QR కోడ్.. కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!