పీపీఎఫ్‌, ‘సుకన్య’ వడ్డీరేట్ల కోత

బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యులు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను కేంద్రం భారీగా......

Published : 01 Apr 2021 01:13 IST

దిల్లీ: బ్యాంకులు, చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో సామాన్యుడు దాచుకొనే సొమ్ముపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై ఏడాదికి ప్రస్తుతం 4 శాతంగా ఉన్న వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)పై ఇచ్చే వడ్డీపైనా కోత పెట్టింది. దీన్ని 7.1 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించింది. సీనియర్‌ సిటిజన్ల సేవింగ్‌ పథకాలపై ఇచ్చే వడ్డీని 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాలపై ఇచ్చే వడ్డీని 7.6 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 

సవరించిన వడ్డీ రేట్లు ఇలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు