తెలుగు భాషను బతికిద్దామంటూ సైకత శిల్పం

ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో అక్కాచెల్లెళ్లు రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది....

Published : 20 Feb 2021 21:16 IST

రాజమండ్రి: ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో అక్కాచెల్లెళ్లు రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ కుమార్తెలైన వారిరువురు ఎంతో శ్రమించి సైకత శిల్పాన్ని రూపొందించారు. అమ్మ భాషను కాపాడుకోవాలని పేర్కొంటూ ‘అ’ అక్షరానికి రక్షణ కల్పించినట్లుగా తీర్చిదిద్దారు. ‘తెలుగు భాషను బతికిద్దాం’, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే నినాదాలతో ఆకర్షణీయంగా రూపొందించారు. ‘ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు కానీ మాతృభాషను మాత్రం మర్చిపోవద్దు. అమ్మను, అమ్మ భాషను మరవకూడదు. మనమంతా తెలుగులోనే మాట్లాడదాం’ అని ఆ చిన్నారులు సందేశమిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని