మాతృభాషను ప్రేమిద్దాం: వెంకయ్యనాయుడు

అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాల్సిన అవసరముందని

Updated : 21 Feb 2021 15:27 IST

హైదరాబాద్‌: అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాల్సిన అవసరముందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలో వెలువడితేనే ప్రజలకు సౌలభ్యమైన సేవలందించినట్లు అవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతితో పాటు తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, పలువురు భాషా వేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... సంస్కృతికి జీవనాడి లాంటి మాతృ భాషే ఉన్నతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుందన్నారు. అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.‘‘భాష కేవలం మాట్లాడుకోవటం కోసమే కాదు. మన గతం, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాతృభాషను మర్చిపోయినవాడు మానవుడే కాదు. మన యాస, భాష అన్నీ తెలుగులోనే ఉండాలి. మాతృభాషలో మాట్లాడటానికే విదేశీయులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వంగా భావించాలి. మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడుదాం’’ అని వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని