International telugu festival: భీమవరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు

వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరగనున్నాయి. ఈ వేడుకలను వెస్ట్‌ బెర్రీ విద్యాలయ ప్రాంగణంలో .....

Published : 04 Oct 2021 18:31 IST

భీమవరం: వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరగనున్నాయి. ఈ వేడుకలను వెస్ట్‌ బెర్రీ విద్యాలయ ప్రాంగణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌-భీమవరం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయప్రోలు భగవాన్‌ వెల్లడించారు. తెలుగు సాహితీవేత్తలు, కళాకారులు, తెలుగు భాషా వికాస సంస్థల సమన్వయంతో తెలుగు భాషా వికాసానికి కృషి, తెలుగు భాషలోని వివిధ సాహితీ ప్రక్రియలపై లబ్ద ప్రతిష్టులతో చర్చలు జరుగుతాయని భగవాన్ తెలిపారు. దేశ విదేశాలనుంచి వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ సంబరాలలో పాల్గొంటారని చెప్పారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సంబరాలను నిర్వహిస్తామన్నారు. ఈ సంబరాలకు గౌరవాధ్యక్షులుగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంస్థ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు  గురు సహస్రావధాని డా.కడిమిళ్ల వరప్రసాద్,  రెడ్డప్ప ధవెజి,  మహేష్ వర్మ,  కంతేటి వెంకట్రాజు, పొన్నపల్లి శ్రీరామరావు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఆరేటి ప్రకాష్  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని