Dating facts: అందం కన్నా.. వ్యక్తిత్వమే మిన్న!

పాశ్చాత్య పోకడలకు పోతున్న యువతలో డేటింగ్‌ ఇప్పుడో సాధారణ విషయంగా మారింది. గతంలో అమ్మాయి/అబ్బాయిని పరిచయం చేసుకొని, డేటింగ్‌ కోసం ఏవైనా మంచి ప్రదేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సర్వం ఆన్‌లైన్‌ మయమైంది.

Updated : 25 Jul 2021 16:13 IST

డేటింగ్‌ నేడొక సాధారణ అంశమని చెబుతున్న యువత!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాశ్చాత్య పోకడలకు పోతున్న యువతలో డేటింగ్‌ ఇప్పుడో సాధారణ విషయంగా మారింది. గతంలో అమ్మాయి/అబ్బాయిని పరిచయం చేసుకొని, డేటింగ్‌ కోసం ఏవైనా మంచి ప్రదేశాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సర్వం ఆన్‌లైన్‌ మయమైంది. దీంతో డేటింగ్‌ యాప్‌లకు గతంలో కన్నా ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. చాలామంది యువతీయువకులు ఆన్‌లైన్‌లో డేటింగ్‌ మొదలుపెట్టారు. కాగా.. డేటింగ్‌ గురించి భారతీయ యువత అభిరుచులను తెలుసుకునేందుకు ‘యూగవ్‌’ అనే సంస్థ, డేటింగ్‌ యాప్‌ ‘బంబుల్‌’ కలిసి సర్వే నిర్వహించాయి. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది యువత ఎదుటివాళ్లలో అందం కన్నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని ఇష్టపడుతున్నామని చెప్పారు.

45 శాతం మంది వర్చువల్‌ లేదా ఆన్‌లైన్‌ డేటింగ్‌ సాధారణ విషయంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఒక వ్యక్తిని నేరుగా కలవడం కన్నా ఆన్‌లైన్‌లో డేటింగ్‌ చేయడం శ్రేయస్కరమని 48 శాతం మంది భావించారు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ ద్వారా వారిపై ఓ అభిప్రాయం ఏర్పడ్డాకనే నేరుగా కలిస్తే మంచిదంటున్నారు.

ప్రత్యక్షంగా ఒక్కసారి కలవకపోయినా ఆన్‌లైన్‌ పరిచయంతోనే ప్రేమలో పడొచ్చని 72శాతం మంది చెబుతున్నారు. అంతేకాదు.. వర్చువల్‌ డేటింగ్‌ వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయని, పైగా కెమెరా ముందు కూర్చుంటున్నందున పెద్దగా ముస్తాబు కావాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

దేశంలో యువతకు వేగంగా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న నేపథ్యంలో 33 శాతం మంది ఆన్‌లైన్‌లో కాకుండా డేటింగ్‌ కోసం బయటకు వెళ్లాలని కాంక్షిస్తున్నారు. మరోవైపు 38 శాతం మంది తాము వ్యాక్సిన్‌ వేసుకున్నవారితోనే బయటకు వెళ్తామని, లేకపోతే వద్దంటామని స్పష్టం చేశారు. కరోనా కాలంలో తమ ప్రాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 

డేటింగ్‌లో యువతీయువకులు నిజాయతీగా ఉంటున్నారట. డేటింగ్‌ యాప్‌లో అసభ్య ప్రవర్తన, వేధింపులు చాలా వరకు తగ్గాయని 74శాతం మంది వెల్లడించారు. డేటింగ్‌ యాప్‌ యూజర్లు చాలా వరకు తమ ప్రొఫైల్‌లో తాము కలవడానికి ఇష్టపడే ప్రాంతాలు, కొవిడ్‌ పరిస్థితుల గురించి ప్రస్తావిస్తున్నారని సర్వేలో తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని