చిన్న కంపెనీల్లో మదుపు..

దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి చెందేందుకు వీలుగా.. ఇప్పుడు చిన్న కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం.. ప్రిన్సిపల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌. ఈక్విటీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ విభాగానికి చెందిన ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఎన్‌ఎఫ్‌ఓ మే 6 వరకూ అందుబాటులో ఉంది.

Updated : 09 Dec 2022 15:43 IST

దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధి చెందేందుకు వీలుగా.. ఇప్పుడు చిన్న కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం.. ప్రిన్సిపల్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌. ఈక్విటీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ విభాగానికి చెందిన ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఫథకంలో కనీస పెట్టుబడి రూ.5,000. ఎన్‌ఎఫ్‌ఓ మే 6 వరకూ అందుబాటులో ఉంది. కొనుగోలు రుసుము లేదు. పెట్టిన పెట్టుబడిని ఏడాదిలోపు 25శాతానికి మించి పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. 1శాతం అమ్మకపు రుసుము వర్తిస్తుంది.

బ్యాంకింగ్‌ రంగంలో.. 
బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సెక్యూరిటీల్లో మదుపు చేసే వ్యూహంతో వచ్చిన పథకం ఇండియాబుల్స్‌ బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ డెట్‌ ఫండ్‌. ఇది డెట్‌ విభాగానికి చెందిన పథకం. ఇందులో కనీస పెట్టుబడి రూ.500. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకంలో మే 9 వరకూ మదుపు చేసేందుకు అవకాశం ఉంది.

అన్ని విభాగాల్లోనూ.. 
పెద్ద, మధ్య, చిన్న తరహా సంస్థల్లో మదుపు చేసే లక్ష్యంతో ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి మార్కెట్లోకి వచ్చిన పథకం.. ఐటీఐ మల్టీ క్యాప్‌ ఫండ్‌. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఇది ఏ రకం సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలనేది నిర్ణయించుకుంటుంది. ఇది ఓపెన్‌ ఎండ్‌డ్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ ఇది. కనీస పెట్టుబడి రూ.1,000. మే 9 వరకూ ఎన్‌ఎఫ్‌ఓ అందుబాటులో ఉంది. పెట్టుబడిని ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే.. 1శాతం అమ్మకపు రుసుము వర్తిస్తుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు