హైటెక్‌ ఆటోవాలా..!

చెన్నైకి చెందిన అన్నా దురై భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. బాగా చదువుకుని

Published : 21 Jul 2021 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులోని చెన్నైకి చెందిన అన్నాదురై భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. బాగా చదువుకుని వ్యాపారవేత్త అవ్వాలని అనుకున్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతడి కలలను కల్లలు చేశాయి. అయినా అన్నాదురై నిరుత్సాహపడలేదు. తాను చేస్తున్న చిన్న పనైనా గొప్పగా చేయాలని సంకల్పించాడు. దీంతో తన ఆటోను హైటెక్‌ ఆటో రిక్షాగా మార్చేశాడు. తన ఆటో ఎక్కేవారికి సరికొత్త అనుభూతి కలిగించేలా ఆటోలో యాపిల్‌ ఐపాడ్‌, వార్తా పత్రికలు, శానిటైజర్‌, టీవీ, మినీ ఫ్రిజ్‌, సెల్‌ఫోన్‌ చార్జర్‌, తినడానికి చిరుతిళ్లు అందుబాటులో ఉంచాడు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించే అన్నాదురై ఆటో ఎక్కే ముందు.. దిగిన తర్వాత వాళ్లకు వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తాడు. గురువులపై ఉన్న గౌరవంతో.. ఉపాధ్యాయులకు తన ఆటోలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు