Hyderabad: ఐపీఎస్‌ అధికారి ఉమేష్ చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకం: సీపీ ఆనంద్‌

ధైర్య సాహసాలకు మారుపేరులా నిలిచిన ఐపీఎస్‌ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.

Published : 30 Mar 2022 01:32 IST

హైదరాబాద్‌: ధైర్య సాహసాలకు మారు పేరులా నిలిచిన ఐపీఎస్‌ అధికారి చదలవాడ ఉమేష్‌చంద్ర పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. దివంగత ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌చంద్ర 56వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగర సీపీ నివాళులర్పించారు. ఎస్‌ఆర్‌ నగర్ కూడలిలో ఉమేష్‌చంద్ర కాంస్య విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. వయసులో రెండేళ్లు సీనియర్‌ అయిన ఆయన మార్గదర్శకత్వంలోనే సివిల్స్ సాధించానని కమిషనర్ గుర్తు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని