Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా

ఓఆర్‌ఆర్‌ లీజు విషయంలో ఆరోపణలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ఐఆర్‌బీ సంస్థ రూ.1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. దీనికి సంబంధించి లీగల్‌ నోటీసులను రఘునందన్‌రావుకు పంపింది. 

Updated : 30 May 2023 03:41 IST

హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్‌ టోల్‌ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్‌ నోటీసులు పంపించింది. రఘునందన్‌రావుపై ఐఆర్‌బీ సంస్థ రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేసింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్‌ వసూలు కాంట్రాక్ట్‌ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌ విషయంలో భాజపా నేత రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని