IRCTC: ట్రావెల్ వీడియోస్ చేయండి.. లక్ష గెలవండి
వీడియోలు ఎలాంటివి రూపొందించాలనుకునేవారు.. ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఐఆర్‌సీటీసీ ఐ ముద్ర యాప్ అండ్ వెబ్ సైట్, ఐఆర్‌సీటీసీ- ఈ క్యాటరింగ్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్, ఐఆర్‌సీటీసీ న్యూ ఈ-టికెటింగ్ వెబ్ సైట్
వ్లాగర్స్‌కు శుభవార్త
దిల్లీ: ట్రావెల్ వ్లాగర్స్‌కు శుభవార్త చెప్పింది రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ). కొరోవర్ అనే సంస్థతో అనుసంధానమై ఈ పోటీ నిర్వహించనుంది. ఇందులో గెలిచిన విజేతలకు రూ.లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకు వ్లాగర్స్ చేయాల్సిందల్లా.. భారతీయ రైల్వేకు సంబంధించిన టికెట్స్, క్యాటరింగ్, టూరిజం, పర్యాటక ప్రదేశాలను చిత్రీకరించి ఆగస్టు 31లోపు పంపాలి.
పంపాల్సిన విధానం
* పోటీలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారు.. https://corover.ai/vlog/. అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
* వీడియోలో ఉన్న క్వాలిటీ, కంటెంట్‌ను న్యాయనిర్ణేతలు పరిశీలనలోకి తీసుకుంటారు. ఆ ప్రకారం 300 మంది విజేతలుగా ప్రకటిస్తారు.
* ఈ పోటీలో గెలిచిన విజేతకు రూ.లక్ష బహుమతిగా లభించనుంది. దాంతో పాటు ఒక ప్రశంసా పత్రం, ట్రోఫీని అందిస్తారు.
* రెండోస్థానంలో నిలిచిన రన్నరప్‌గా నిలిచిన వారికి.. రూ.50వేలు..మూడో స్థానంలో ఉన్నవారికి రూ.25వేలు ఇవ్వనున్నారు.
* మిగిలిన స్థానంలో నిలిచిన విజేతలకు రూ.500 విలువచేసే గిఫ్ట్ కార్డులతో పాటు ప్రశంసా పత్రాలను ఇస్తారు.
* ఇక పోటీలో పాల్గొన్న వారు అప్‌లోడ్ చేసే వీడియోలను ఐఆర్‌సీటీసీ కాపీరైట్స్ తీసుకుంటుంది.
ఇవి ఎంచుకోవచ్చు..
వీడియోలు ఎలాంటివి రూపొందించాలనుకునేవారు.. ఐఆర్‌సీటీసీ టూరిజం, ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఐఆర్‌సీటీసీ ఐ ముద్ర యాప్ అండ్ వెబ్ సైట్, ఐఆర్‌సీటీసీ- ఈ క్యాటరింగ్, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్, ఐఆర్‌సీటీసీ న్యూ ఈ-టికెటింగ్ వెబ్ సైట్, ఐఆర్‌సీటీసీ బస్‌బుకింగ్, ఐఆర్‌సీటీసీ తేజస్ ట్రైన్, ఐఆర్‌సీటీసీ రూమ్ బుకింగ్‌కి సంబంధించిన వీడియోలు ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: ‘ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’: వీడియో షేర్ చేసిన తెదేపా
-
Vizag: రుషికొండపై చకచకా పనులు.. కేసులున్నా వెనక్కి తగ్గకుండా..
-
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ శుభారంభం.. క్రికెట్ సహా 5 పతకాలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
24సార్లు వినతిపత్రాలు ఇచ్చినా.. వందల సార్లు ఫిర్యాదుచేసినా..!
-
Tirumala Brahmotsavam: సూర్యప్రభ వాహనంపై శ్రీవారు