Health: శీతల పానీయాలు ఎక్కువగా తాగితే ఆరోగ్యం ఏమవుతుందంటే?

వేసవి వచ్చిందంటే దాహం తీరడానికి శీతల పానీయాల దరి చేరుతాం...దప్పిక తీరుతుందని గడ గడ చల్లగా ఉండే పానీయం తాగేస్తాం..ఇలా కొంతవరకైతే బాగుంటుంది.

Published : 20 Apr 2022 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవి వచ్చిందంటే దాహం తీరడానికి చాలామంది శీతల పానీయాల దరి చేరుతుంటారు. దప్పిక తీరుతుందని చల్లగా ఉండే పానీయాన్ని గడ గడ తాగేస్తుంటారు. అదే పనిగా రెండు, మూడు సీసాలు తాగేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అలా తాగేస్తే లేని పోని జబ్బులను కొని తెచ్చుకున్నట్టేనని పేర్కొంటున్నారు. దాని వల్ల మధుమేహమే కాదు.. గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

  • శీతల పానీయాల్లో చక్కెర ఉంటుంది తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు. 
  • ఈ పానీయాలు కేవలం బరువు పెంచుతాయి తప్ప... ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ చేసిన అధ్యయనంలో తేలింది.
  • మితిమీరి కూల్‌ డ్రింక్స్‌ తాగే పురుషులకు గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతుంది.
  • శీతల పానీయాలు తాగే పిల్లలు ఏటా 3 - 5 కిలోల బరువు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
  • ఆరోగ్యాన్ని దెబ్బతీసే పానీయాలకు బదులుగా పుచ్చకాయ, కర్బూజ పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిలోనూ చక్కెర లేకుండా తాగితే మరీ మంచిది.
  • సాధ్యమైనంత వరకు మంచి నీటిని ఎక్కువగా తాగేందుకు ప్రయత్నించాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని