Porn Case: రాజ్‌కుంద్రాకు బెయిల్ నిరాకరణ
అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టులో చుక్కెదురైంది.
ముంబయి: అశ్లీల చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ముంబయి కోర్టులో చుక్కెదురైంది. కుంద్రా సహా అతడి సహాయకుడు ర్యాన్ థోర్ప్‌కు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం బుధవారం నిరాకరించింది. ఈ కేసులో పోలీసులు ఏ ప్రాతిపదికన వాదనలు వినిపించారో తెలపాలని కుంద్రా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పలు ఓటీటీల్లోనూ హాట్‌షాట్స్ తరహా చిత్రాలే ప్రసారమవుతుండగా.. పోలీసులు వీటిని మాత్రమే అశ్లీల చిత్రాలుగా ఎలా వర్గీకరిస్తారంటూ వాదనలు వినిపించారు. అయితే కోర్టు మాత్రం కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసు విచారణలో భాగంగా రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో కుంద్రా ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన్ను పోలీసులు గత సోమవారం అరెస్టు చేశారు. అతడి సంస్థకు సంబంధించిన సాంకేతిక వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ర్యాన్ థోర్ప్ మరుసటి రోజు అరెస్టయ్యాడు. రాజ్ కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు మొత్తం ‘హాట్‌షాట్స్’ యాప్ చుట్టూ తిరుగుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో.. ప్లాన్ బీలో భాగంగా బాలీఫేమ్ పేరుతో మరో కొత్త యాప్‌ను కుంద్రా ప్రారంభించాడు. అయితే పోలీసులు అశ్లీల చిత్రాలుగా పెర్కొంటున్న వీడియోల్లో స్పష్టమైన లైంగిక చర్యలేవీ లేవని కుంద్రా పేర్కొన్నాడు. మరోవైపు ‘హాట్‌షాట్స్’ యాప్‌లోని కంటెంట్ కచ్చితమైన స్వభావం గురించి తనకేమీ తెలియదని కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పోలీసులకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!