Heart Diseases: మహిళల గుండె గట్టిదేనా..? ఎప్పుడు ప్రమాదమంటే..!

మహిళలు గట్టివారని, వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని చాలా మంది భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితు...

Updated : 29 Sep 2022 13:29 IST

ఇంటర్పెట్‌ డెస్క్‌: మహిళలు గట్టివారని, వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువని చాలా మంది భావిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సరైన ఆలోచన కాదని వైద్యులు పేర్కొంటున్నారు. కుటుంబ చరిత్ర, తొందరగా మెనోపాజ్‌ రావడంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోవడంతో ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడంతో గుండెపోటు లక్షణాలు కనిపించినా గుర్తించలేరని ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీధర్‌ కస్తూరి తెలిపారు.

ఎందుకు కేసులు పెరుగుతున్నాయి..

ఇటీవల 25-30 ఏళ్ల మధ్యలో ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తోంది. ఇందులో మహిళలు కూడా ఉంటున్నారు. మహిళలను మెనోపాజ్‌కు ముందు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ గుండెపోటు నుంచి రక్షిస్తుంది. వంశ పారంపర్యంగా, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నపుడు, మధుమేహం వచ్చినపుడు గుండెపోటు రావొచ్చు. గృహిణులు, ఉద్యోగాలు చేస్తున్న వారు నీరసంగా ఉన్నా అసిడిటీ అని వదిలేస్తారు. 

వైద్యం ఎప్పుడు అవసరం

మెనోపాజ్‌ దాటిన మహిళలు తప్పనిసరిగా ఏడాదికి ఒకసారైనా గుండెకు సంబంధించిన ఈసీజీ, ఇతర గుండె పరీక్షలు చేయించుకోవాలి. వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అనుమానం ఉన్నపుడు మహిళలు ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు. జాప్యం చేస్తే అదే ప్రమాదానికి దారి తీస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని