Health: పిల్లలకు అవసరమైతేనే శస్త్రచికిత్స

 పసి పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే శస్త్రచికిత్స చేయడానికి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. మందులతో నయమయితే చాలు అనే ధోరణితో ఉంటారు. 

Published : 26 Jun 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసి పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే శస్త్రచికిత్స చేయడానికి తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. మందులతో నయమయితే చాలు అనే ధోరణితో ఉంటారు. పెద్దల కంటే చిన్నారులు తట్టుకోలేరని భావిస్తుంటారు. పైగా పిల్లలకు అత్యవసర ఆపరేషన్ల అవసరం ఉండదని అనుకుంటారు. పిల్లలకువచ్చే ఇబ్బందులు తల్లిదండ్రుల నమ్మకాలపై పిడియాట్రిక్‌ సర్జన్‌ రావి హిమజ పలు సూచనలు చేశారు.

అంతగా అవసరం ఉండదా..?

పిల్లలకు ఆపరేషన్‌ అవసరం లేదనడం సరికాదు. హెర్నియాతో ఇబ్బందులు తలెత్తుతాయి. గజ్జల్లో వాపు వస్తుంది. పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చి లోపలికి పోతుంటాయి. దీనితో వాపు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సిందే. బొడ్డు దగ్గర వాపు వచ్చినా సరి చేయక తప్పదు. 

మందులు సరిపోతాయా..?

పిల్లలకు వచ్చే అన్ని వ్యాధులకు మందులతో నయం కాకపోవచ్చు.  జలుబు, దగ్గు లాంటి వాటికి మందులు సరిపోతాయి. సమస్యాత్మక జబ్బులకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది. అపెండిక్స్‌ వచ్చినపుడు కూడా శస్త్రచికిత్స తప్పదు. పేగులో పేగు చొచ్చుకొనిపోయినపుడు అత్యవసరంగా చేయక తప్పదు. ఇలాంటి వాటికి మందులు వాడినంత మాత్రనా జబ్బు నయం కాదు. సర్జరీ చేయకపోతేనే ప్రాణాపాయం ఉంటుంది కానీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

సర్జరీలతో వైకల్యం వస్తుందా..?

పిల్లలకు సర్జరీలు చేస్తే వైకల్యం రావడం అంటూ జరగదు. వైకల్యం రాకుండా సర్జరీలతో నయం చేయడానికి వీలుంది. గ్రహణమొర్రి వచ్చినపుడు కూడా ఆపరేషన్‌తో సరి చేస్తాం. ఓపెన్‌ సర్జరీల కంటే లాప్రోస్కోపిక్‌ సర్జరీలు చాలా మేలు చేస్తాయి. తొందరగా కోలుకుంటారు. సమస్యలు కూడా పెద్దగా ఉండవు. నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని