AP News: ఉద్యోగులకు డీఏ బకాయిలు, పీఆర్సీపై ఉత్తర్వులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డీఏ బకాయిలు, వేతన సవరణ సంఘం(పీఆర్పీ)కి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 1నుంచి 5 బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనంతో ఇచ్చే డీఏ కలిసి ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది.

Updated : 18 Jan 2022 03:31 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు, వేతన సవరణ సంఘం(పీఆర్సీ)కి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 1నుంచి 5 బకాయిల చెల్లింపునకు గాను ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనంతో ఇచ్చే డీఏ కలిసి ఉందని ఆర్థిక శాఖ వెల్లడించింది. డీఏ బకాయిలను సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. డీఏ బకాయిలను సీపీఎస్‌ ఉద్యోగుల పీఆర్‌ఏఎన్‌ ఖాతాల్లో జమ చేయనున్నారు.
పీఆర్సీ విషయమై...  2018 జులై నుంచి, ఆర్థిక ప్రయోజనాలను 2020 ఏప్రిల్‌ 1 నుంచి చెల్లించున్నట్లు, డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి నగదు చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ  పేర్కొంది.
మాస్టర్‌ స్కేల్‌, ఫిట్‌మెంట్‌ అమలుకు గాను ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూల వేతనంపై 23 శాతంగా ఫిట్ మెంట్‌ నిర్ధరించినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఫిట్‌మెంట్ ను 2022 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించింది.
అంతేకాకుండా ఉద్యోగులకు కేటగిరీల వారీగా హెచ్‌ఆర్‌ఏ చెల్లింపులు చేయనున్నారు. 50 లక్షల జనాభా దాటిన పట్టణాల్లో నివాసం ఉండే ఉద్యోగులకు బేసిక్‌లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనున్నారు. 5నుంచి 50లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో ఉద్యోగులకు బేసిక్‌లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. 5లక్షలలోపు జనాభా ఉన్న పట్టణాల్లోని ఉద్యోగులకు బేసిక్‌లో 8 శాతం ఇవ్వనున్నారు.

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులు 16శాతం కేటగిరీలోకి రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని