Chikoti Praveen: రూ.2.8కోట్ల రేంజ్‌ రోవర్‌ కారు.. చీకోటి ప్రవీణ్‌కు ఐటీ నోటీసులు

క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.  ₹2.8 కోట్ల విలువైన రేంజ్‌ రోవర్‌ కారుకు సంబంధించిన విషయంలో వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

Published : 28 Feb 2023 14:01 IST

హైదరాబాద్:  క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.  రూ.2.8 కోట్ల విలువైన రేంజ్‌ రోవర్‌ కారుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ కారు తన స్నేహితుడి సంస్థకు చెందినదని.. అవసరమున్నప్పుడు దానిని వాడుకుంటున్నట్లు ప్రవీణ్‌ అధికారులకు తెలిపారు. అయితే అధికారులు మాత్రం ఇది  బినామీ సంస్థ పేరుతో ప్రవీణ్‌ కొనుగోలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. అయినప్పటికీ నేపాల్‌, హాంకాంగ్‌, శ్రీలంకలో ఆయన క్యాసినో నిర్వహణను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఐటీ కూడా నోటీసులు పంపించడంతో.. ప్రవీణ్‌పై అన్ని వైపుల నుంచి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని