Mallareddy: ఐటీX మల్లారెడ్డి.. సోదాల్లో పాల్గొన్న రత్నాకర్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాల సందర్భంగా ఆయన కుమారుడు  భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Published : 25 Nov 2022 16:42 IST

హైదరాబాద్‌: ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాల సందర్భంగా ఆయన కుమారుడు  భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సోదాలు జరుగుతున్న క్రమంలో బుధవారం రాత్రి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్‌తో కలిసి బోయిన్‌పల్లి ఠాణాకు వచ్చారు. 

ఆదాయపన్ను దాడులు నకిలీవిగా కనిపిస్తున్నాయని.. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్‌రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని.. సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్‌పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్‌ హైకోర్టులో శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రత్నాకర్‌పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది. నాలుగు వారాలపాటు రత్నాకర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై గందరగోళం...

మంత్రి మల్లారెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ల్యాప్‌టాప్‌పై గందరగోళం కొనసాగుతోంది. ఐటీ అధికారి రత్నకుమార్‌ ల్యాప్‌టాప్‌ చోరీ అయిందని, అందులో ఉన్న విలువైన డాటా తొలగించారని... మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని... ఐటీ అధికారులకు సమాచారం అందించారు. అయినప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు ల్యాప్‌టాప్‌ తీసుకువెళ్లలేదు. ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం ఉందని ఐటీ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ బోయిన్‌పల్లి పోలీసుల వద్దనే ఉంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని