కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్‌ ఆఫీసులో సోదాలు

కడపలోని షిర్డి సాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Updated : 11 May 2024 14:16 IST

కడప: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుచరుడైన విశ్వేశ్వర్‌రెడ్డికి సంబంధించిన షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు కంపెనీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉండడంతో ఇక్కడ నుంచి డబ్బుల పంపిణీ జరుగుతున్నట్లు అనుమానం రావడంతో సోదాలు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇదే కంపెనీలో నాలుగు నెలల క్రితం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల తరుణంలో మళ్లీ ఎన్నికల పరిశీలకులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని