
Marriage: 95 ఏళ్ల వయసులో వివాహం.. 23 ఏళ్ల క్రితం కలిసిన వ్యక్తితో..
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించాడో వ్యక్తి. నచ్చిన జీవిత భాగస్వామి దొరక్క 95 ఏళ్లపాటు బ్రహ్మచారి జీవితం గడిపిన ఓ వృద్ధుడు.. తన ఇష్టసఖిని వెతుక్కొని ఇన్నాళ్లకు ఓ ఇంటివాడయ్యాడు. 23 ఏళ్ల క్రితం తనకు పరిచయమైన మహిళను తాజాగా పెళ్లాడాడు. దీన్ని నమ్మలేకపోతున్నానని, ఇది తనకు కొత్త జీవితంలా ఉందంటూ ఆ పెళ్లికొడుకు సంతోషం వ్యక్తం చేశాడు.
బ్రిటన్‌లోని కార్డిఫ్ ప్రాంతానికి చెందిన జులియన్ మొయిలే (95) ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. నచ్చిన భాగస్వామి దొరక్క ఇన్నాళ్లూ పెళ్లిపీటలెక్కలేదు. అయితే 23 ఏళ్ల క్రితం ఓ చర్చిలో తారసపడ్డ వలేరియా విలియమ్స్ (84)తో అతడికి పరిచయం ఏర్పడింది. చర్చిలో తరచూ కలుసుకోవడం, ఆలోచనలు పంచుకోవడంతో ఆమెపై జులియన్ మనసుపడ్డాడు. కానీ, ఈ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ఇన్నాళ్లపాటు సందేహించాడు. ఎట్టకేలకు ధైర్యం చేసి తన మనసులో మాట బయటపెట్టడంతో విలియమ్స్ అంగీకరించింది. దీంతో జులియన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు మొదట కలుసుకున్న చర్చిలోనే ఈనెల 19న ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది.
తన జీవిత భాగస్వామి గురించి జులియన్ మాట్లాడుతూ.. ఆమె ఎంతో మంచి వ్యక్తి అని, దయా హృదయురాలు అని పేర్కొన్నాడు. ఈ అద్భుత ఘట్టాన్ని తాను నమ్మలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు నూతన సంవత్సరంలా ఉందని.. జీవితం కడవరకు ఆమె సాంగత్యాన్ని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తన భర్త ఓ జెంటిల్మెన్ అని వధువు మురిసిపోయింది. మరణించేవరకూ ఒకరికొకరు తోడునీడగా ఉంటామని ఆ జంట పేర్కొంది. జులియన్ స్వదేశమైన ఆస్ట్రేలియాలో హనీమూన్‌ను జరుపుకోనున్నట్లు ఆ జంట తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Sonu sood: కుమారుడి చికిత్స కోసం ఓ తల్లి తాపత్రయం.. సోనూసూద్ పేరుతో ఆన్లైన్ మోసం
-
Politics News
Shivsena: శివసేన ముందు ముళ్లబాట!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
LPG: భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
-
Related-stories News
Andhra News: ప్రొబేషన్ వేళ.. గతేడాది ఆందోళనలో పాల్గొన్న వారి పేర్లతో ‘హిట్ లిస్ట్‌లు’
-
Ap-top-news News
Andhra News: తోతాపురి మామిడా.. మజాకా!.. టన్ను ఎంతో తెలుసా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..