TTD: తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌(తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు.

Updated : 16 Jun 2024 17:33 IST

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నూతన ఈవోగా ఐఏఎస్‌ అధికారి జె. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. అంతకుముందు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని.. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా.. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్థప్రసాదాలు అందజేశారు.

‘‘తితిదే ఈవో కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు. తితిదేలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తా. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతా. దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తేవాలి’’ అని ఈవో శ్యామలరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని