Jagananna vidya deevena: ఉన్నతవిద్యతోనే పేదరికం నిర్మూలన : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత సాయం నిధులు విడుదల చేశారు..

Updated : 29 Jul 2021 15:10 IST

అమరావతి: ఉన్నత చదువులు లేకపోతే పేదరికం ఎప్పటికీ పోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత సాయం నిధులు విడుదల చేశారు. మొత్తం 10.97 లక్షల మంది ఖాతాల్లో రూ.693.81 కోట్లను విడుదల చేశారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులు చదివే ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సుల ఫీజుల్ని నాలుగు విడతల్లో చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఏప్రిల్‌ 19న మొదటి విడత ఇవ్వగా.. గురువారం రెండో విడత చెల్లింపులు చేసినట్లు వివరించింది. డిసెంబరులో మూడు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.26,677 కోట్లు ఖర్చు చేశామని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని