Jai Bhim: జై భీమ్‌లో చూపించిన దారుణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి!

తమిళ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్‌’ ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది. జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిజజీవితం ఆధారంగా తెరకెక్కింది. సమాజంలో మైనార్టీ వర్గాల అమాయకత్వాన్ని కొందరు పోలీసులు ఆసరాగా చేసుకుని

Published : 06 Nov 2021 22:22 IST

ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  తమిళ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్‌’ ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల మెప్పూ పొందింది. త.శె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. సమాజంలో బలహీనవర్గాల అమాయకత్వాన్ని కొందరు పోలీసులు ఆసరాగా చేసుకుని, వారిపై ప్రదర్శించిన కర్కశత్వాన్ని చూపించిన తీరు.. న్యాయవాదిగా సూర్య కేసును ఎలా ఛేదించాడు? అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి నిజ జీవితంలోనూ అలాంటి ఘటనలు జరుగుతుంటాయా? అంటే అవుననే చెప్పారు ఐపీఎస్‌ అధికారి, ప్రస్తుత మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో ఖాతా పంచుకున్నారు.  

2011-2012 సంవత్సరంలో మెదక్ జిల్లా పటాన్ చెరులో ఒక వ్యక్తి పోలీసుల కస్టడీలో మరణించాడు. అండర్ ట్రయల్ ఖైదీ కస్టడీ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ అసిస్టెంట్ (ట్రైనీ )కలెక్టరుగా నన్ను  మెజిస్టీరియల్ ఎంక్వైరీకి అధికారిగా నియమించారు. అందులో భాగంగా.. నేను జైలు, మార్చురీ, ఆసుపత్రిని సందర్శించి, బాధ్యులైన వివిధ పోలీసు సిబ్బందిని విచారించి, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి నివేదిక సమర్పించాను. ఆ నివేదిక ఆధారంగా, బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది’’ అంటూ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని