Jawahar Reddy: సీఎస్‌గా జవహర్‌రెడ్డి.. ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీవిరమణ చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధానకార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయనకు సర్వీసు ఉంది. అంటే మరో ఏడాదిన్నరపాటు ఆయన సీఎస్ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది.
కొత్త సీఎస్‌గా నియమితులైన జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్ ప్రసాద్ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్ వలెవన్ (1989) సీఎస్ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి జగన్ మాత్రం... జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే... తితిదే ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే, సీఎంఓకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంఓ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి.
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..
ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య నియమితులయ్యారు. వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, ఆర్అండ్బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహమ్మద్ దివాన్‌ను నియమించారు.బుడితి రాజశేఖర్ సెలవు నుంచి తిరిగొచ్చాక జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Aaftab: శ్రద్ధాను చంపి.. చికెన్ రోల్ తిన్నాడు
-
India News
రూ.50వేల చొప్పున తీసుకున్నారు.. భర్తల్ని వదిలేసి ప్రియుళ్లతో వెళ్లిపోయారు
-
Crime News
Crime News: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య బలవన్మరణం
-
Politics News
Kotamreddy: అభిమానం ఉండాలి.. రూ.కోట్లుంటే గెలవలేరు: కోటంరెడ్డి
-
Politics News
జగన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు