Jawed Habib: నన్ను క్షమించండి.. సరదాకే ఆ మహిళ జుట్టు పై ఉమ్మివేశా!

ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ పూజా అనే మహిళ జుట్టును సరిచేస్తూ ఉమ్మి వేసిన ఓ వీడియో గురువారం వైరల్‌గా సంగతి తెలిసిందే.

Published : 08 Jan 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కేశాలంకరణ నిపుణుడు జావెద్‌ హబీబ్‌ పూజా అనే మహిళ జుట్టును స్టైలింగ్‌ చేస్తూ ఉమ్మి వేసిన ఓ వీడియో గురువారం వైరల్‌గా సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జావెద్‌ హబీబ్‌ సంస్థ నిర్వహించిన ఓ వర్క్‌షాపులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయంపై పూజతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇందులో వాస్తవికత ఎంతో నిగ్గు తేల్చాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులను ఆదేశించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఇలా చేయడం శిక్షార్హమైన నేరమేనని కమిషన్‌ తేల్చి చెప్పింది. దీనిపై జావెద్‌ హబీబ్‌కు కమిషన్‌ ఓ నోటీసు పంపింది. దీనిపై క్షమాపణలు చెప్పిన జావెద్‌ తాజాగా అలా ఎందుకు చేశాడో వివరణ ఇచ్చారు. ‘‘మా వర్క్‌షాప్స్‌ అనేవి వృత్తిపరంగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ సేపు ఉండటంతో కాస్త హాస్యభరితంగా చేసేందుకే.. నీళ్లకు కొరత ఉంటే ఉమ్మిని కూడా వాడొచ్చు అన్నా. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’’ అని వీడియో విడుదల చేశారు. ఈ రెండు వీడియోలు చూసిన నెటిజన్లు జావెద్‌ ప్రవర్తనా తీరుపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వందల సెలూన్ల అధిపతి అయి ఉండి.. ఇదేం ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని