Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీ విడుదల

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ప్రాథమిక కీ(JEE Main Session-1 (2023) – Answer Key) విడుదలైంది. ఈ కీపై ఫిబ్రవరి 4వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలపేందుకు ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. 

Published : 03 Feb 2023 02:24 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీ(JEE Main Session-1 (2023) – Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గురువారం  కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు ప్రశ్నాపత్రాలను అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/లో అప్‌లోడ్‌ చేసినట్టు పేర్కొంది. ఈ కీపై  అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4న రాత్రి 7.50గంటల లోపు ఆన్‌లైన్‌ విధానంలో తెలపవచ్చని పేర్కొంది. అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ.200లు చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టుల్లో నిపుణులు పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవే అయితే.. ఆన్సర్‌ కీని సవరించి తుది కీ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని