JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు (JEE Main Admit Cards) విడుదలయ్యాయి. వాటిని ఈ దిగువ ప్రాసెస్ ఫాలో అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) తొలి విడత పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్ష జరిగే వారి అడ్మిట్ కార్డులు ఇప్పుడు అందుబాటులోకి ఉంచింది. jeemain.nta.nic.in వెబ్‌సైటు నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
- jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్-1కు సంబంధించి లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.
- కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
- ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in. ద్వారా ఎన్‌టీఏకి ఇ-మెయిల్ చేయొచ్చు.
దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహిస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్
-
Movies News
Samantha: ‘సామ్.. మళ్లీ ప్రేమలో పడొచ్చుగా..!’ నెటిజన్ ట్వీట్‌కు సామ్ సమాధానం ఏమిటంటే..?
-
Crime News
Crime News: పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న హత్య కేసులో ముగ్గురి అరెస్టు: ఎస్పీ
-
India News
Uddhav Thackeray: ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్..!
-
Sports News
T20 Cricket: టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా..
-
General News
MLC kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా