JEE Main 2023 answer key: జేఈఈ మెయిన్ తుది ‘కీ’ విడుదల.. త్వరలో ఫలితాలు!
జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష తుది కీ(JEE Main Session-1 (2023) Answer Key) విడుదలైంది. ప్రాథమికంగా విడుదల చేసిన కీపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం సోమవారం ఎన్‌టీఏ(NTA) తుది కీ విడుదల చేసింది.
దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్(JEE main 2023) తొలి విడత పరీక్షల తుది కీ (JEE Main Session-1 (2023) – Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం తుది కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీలతో పాటు ప్రశ్నాపత్రాలను ఇటీవల అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అభ్యంతరాలను స్వీకరించిన ఎన్‌టీఏ.. తాజాగా పరీక్ష -1 (బీటెక్/బీఈ)కు సంబంధించిన తుది కీ https://jeemain.nta.nic.in/ని విడుదల చేసింది. పేపర్ 2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్)కు సంబంధించిన తుది కీని ఇంకా ప్రకటించలేదు. అలాగే, ఏ సమయంలోనైనా జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడత పరీక్షను దేశ వ్యాప్తంగా దాదాపు 8.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
-
Sports News
MS Dhoni: ఐపీఎల్.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్ వాట్సన్
-
Politics News
Tejashwi Yadav: మాకు సీఎం..పీఎం కోరికల్లేవు: తేజస్వీ యాదవ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు