JEE Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ తుది ‘కీ’ విడుదల.. త్వరలో ఫలితాలు!

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష తుది కీ(JEE Main Session-1 (2023)  Answer Key) విడుదలైంది. ప్రాథమికంగా విడుదల చేసిన కీపై అభ్యంతరాలను స్వీకరించిన  అనంతరం సోమవారం ఎన్‌టీఏ(NTA) తుది కీ విడుదల చేసింది. 

Published : 06 Feb 2023 15:08 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్షల తుది కీ (JEE Main Session-1 (2023) – Answer Key) విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ పరీక్షలను నిర్వహించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సోమవారం తుది కీని విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీలతో పాటు ప్రశ్నాపత్రాలను ఇటీవల అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి అభ్యంతరాలను స్వీకరించిన ఎన్‌టీఏ.. తాజాగా పరీక్ష -1 (బీటెక్‌/బీఈ)కు సంబంధించిన తుది కీ https://jeemain.nta.nic.in/ని విడుదల చేసింది. పేపర్‌ 2 (బీ.ఆర్క్‌/బీ.ప్లానింగ్‌)కు సంబంధించిన తుది కీని ఇంకా ప్రకటించలేదు. అలాగే, ఏ సమయంలోనైనా జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడత పరీక్షను దేశ వ్యాప్తంగా దాదాపు 8.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు