Jee Main 2023: త్వరలోనే జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోవచ్చు!

జేఈఈ మెయిన్(Jee main 2023) తొలి విడత పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు ఎన్‌టీఏ (NTA) కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలోనే  ఈ ఫలితాలు(Jee main 2023 Results) విడుదల చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ ఫలితాలు విడుదలైతే ఇలా చెక్‌ చేసుకోవచ్చు..

Updated : 05 Feb 2023 17:41 IST

దిల్లీ: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్ష ఫలితాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన ఎన్‌టీఏ.. తుది కీ, ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే, వచ్చే వారంలోనే జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షల కోసం దేశ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. అయితే, పేపర్‌ 1 (బీఈ/బీటెక్‌ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6లక్షల మందికి పైగా అమ్మాయిలు; 6లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్‌ 2 (బీ.ఆర్క్‌/బీ.ప్లానింగ్‌) పరీక్షను 46వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25వేల మంది అబ్బాయిలు; 21వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జరగనున్న విషయం తెలిసిందే.

పరీక్ష ఫలితాలు తెలుసుకోండి ఇలా..

  • ఎన్‌టీఏ జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ను సందర్శించండి
  • హోమ్‌ పేజీలో జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1(2023) ఫలితాలు అనేలింక్‌పై క్లిక్‌ చేయండి
  • అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌/పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్‌ చేయాల్సి చేయడం ద్వారా స్క్రీన్‌పై మీ ఫలితం కనబడుతుంది. ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ తీసుకొని భవిష్యత్తు రిఫరెన్స్‌ కోసం భద్రపరచండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని