JEE Main 2023: ఇలా ప్రిపేర్‌ అయితే.. ‘జేఈఈ మెయిన్‌’లో విజయం మీదే..!

లక్షలాది మంది విద్యార్థులు రాస్తోన్న జేఈఈ మెయిన్‌ 2023(JEE Main2023) పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఈ పరీక్షలో విజయం సాధించేందుకు ప్రిపేర్‌ అవుతోన్న శ్రీ చైతన్య ఐఐటీ జాతీయ సమన్వయకర్త ఎం.ఉమాశంకర్‌ పలు కీలక సూచనలు చేశారు. 

Published : 06 Jan 2023 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main2023) పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే ఈ పరీక్షలు(Exams) ఈ నెలలోనే జరగనున్నాయి. జనవరి 24 నుంచి 31వరకు జేఈఈ మెయిన్‌(JEE main) తొలి విడత పరీక్షలు నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ(NTA) ఇప్పటికే వెల్లడించింది. ఒకవేళ అనూహ్యంగా ఆటంకాలు ఎదురైతే ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు కూడా ఈ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. పరీక్షలకు టైం సమీపిస్తుండటంతో ప్రిపేరేషన్‌‌(preparation)లో నిమగ్నమైన విద్యార్థులకు విద్యారంగ నిపుణులు చేస్తోన్న కీలక సూచనలివే..

  1. విద్యార్థి  పటిష్ఠమైన ప్రణాళికతో తనకు అనువుగా ఉండేలా  టైమ్‌టేబుల్‌(Time table) రూపొందించుకోవాలి.
  2. సబ్జెక్టుల మధ్య సమయాన్ని విభజించే బదులు ఒక రోజులో రెండు సబ్జెక్టులపై దృష్టి పెట్టండి. ఏది, ఎప్పుడు, ఏం చదవాలని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు.
  3. రోజులో రెండు సబ్జెక్టులు మాత్రమే చదవడం వల్ల అందులోని భావాలను అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి(Problem solving) మీద ఎక్కువ దృష్టి పెట్టడం సాధ్యమవుతుంది. తద్వారా చదివే అంశాలపై పట్టు సాధించడమే కాకుండా ఆత్మవిశ్వాసం(Self confidence)తో ముందుకు వెళతారు.
  4. ప్రతి గంట సన్నద్ధత(Preparation)లో ఓ పది నిమిషాలు విరామం తీసుకోవచ్చు. ఈ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడపండి. అప్పుడు సెల్‌ఫోన్‌(Mobile phone) మాత్రం వాడొద్దు.
  5. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు(Mock tests)లను ఎక్కువగా సాధన చేయండి. వీటిని డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ మీదే తీసుకోండి. ట్యాబ్స్‌(Tabs), స్మార్ట్‌ఫోన్ల(smart phones)లో రాయొద్దు.
  6. మీరు పరిపూర్ణంగా పూర్తిచేసిన అంశాలు, అధ్యాయాలను మాత్రమే తిరిగి పునశ్చరణ(Revision) చేయండి. కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు. సమీకరణాలు- సూత్రాలు లాంటి అంశాలపై దృష్టి పెట్టండి.
  7. అన్నింటికన్నా ముందు జేఈఈ మెయిన్‌- 2019 నుంచి 2022 వరకూ నిర్వహించిన అన్ని ప్రశ్నపత్రాల(Question papers)ను పరిపూర్ణంగా సాధన చేయండి. అంతేగాని వాటిని బట్టీపట్టొద్దు.
  8. రోజులో కనీసం 3 గంటల సమయం సబ్జెక్టులకు ఇచ్చి, చివరి 3 గంటలు మాక్‌ టెస్టులు రాయండి. అందులో తప్పుగా సమాధానాలు గుర్తించినవాటికి సరైన విశ్లేషణ తీసుకోవాలి. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు అదే తప్పు పునరావృతం కాకుండా చూసుకోండి.
  9. ‘ఎన్ని ప్రశ్నలు రాశామన్నది కాదు.. ఎన్ని కరెక్టుగా గుర్తించామన్నదే’ కీలకం అని మర్చిపోవద్దు. ప్రశ్నలు పూర్తిగా చదివి అందులోని ముఖ్యమైన పదాలను, పదాల సరళిని గమనించి.. అనంతరం సమాధానం గుర్తిస్తే చిన్నచిన్న తప్పులను కట్టడి చేయొచ్చు.
  10. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకునేవారికి విజయం తథ్యం. ఎందుకంటే ఏదో రూపేణా పరీక్ష సమయంలో ఎదురైన చేదు అనుభవాలతో భయపడకుండా, ధైర్యంగా ముందుకు వెళితే విజయం మీదే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని