JEE Main 2023: ఇంకా 3రోజులే.. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేశారా?

విద్యార్థులకు అలర్ట్‌.. జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష రిజిస్ట్రేషన్లకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Published : 09 Jan 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష(JEE main session 1 exam) జనవరి 24 నుంచి 31వరకు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12న రాత్రి 9గంటల వరకు మాత్రమే విద్యార్థులు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉండగా.. దరఖాస్తు రుసుము మాత్రం అదేరోజు రాత్రి 11.50గంటల వరకు చెల్లించేందుకు ఎన్‌టీఏ అధికారులు అవకాశం కల్పించారు.  పరీక్ష కేంద్రాలు ఏయే నగరాల్లో నిర్వహిస్తారనే విషయాన్ని ఈ వారంలోనే వెల్లడించనుండగా.. అడ్మిట్‌ కార్డులను మాత్రం వచ్చే వారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఇవి ఈ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయనే విషయాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. 

మరోవైపు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్ష కోసం విద్యార్థులు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. రెండో విడత పరీక్ష(JEE main session 2 exam) ఏప్రిల్‌ 6నుంచి 12వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహించే నగరాల జాబితాను మార్చి మూడో వారంలో; అడ్మిట్‌ కార్డులను మార్చి చివరి వారం నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

తొలి విడత పరీక్షకు దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోని విద్యార్థులు ఇలా దరఖాస్తు చేసుకోండి.

  • తొలుత అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inను సందర్శించండి. 
  • జేఈఈ మెయిన్‌ 2023 అప్లికేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి
  • అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా రిజిస్టర్‌ అవ్వండి
  • పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి
  • ఆ దరఖాస్తును డౌన్‌లోడ్‌చేసి భవిష్యత్తు అవసరాల కోసం ఆ కాపీని మీ వద్దే ఉంచుకోండి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని