జేఈఈ మెయిన్స్‌ పరీక్ష వాయిదా

జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా

Updated : 18 Apr 2021 12:13 IST

దిల్లీ: ఐఐటీ-జేఈఈ(మెయిన్‌) పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఐటీ జేఈఈ(మెయిన్‌) ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘ఐఐటీ జేఈఈ (మెయిన్‌) పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లకు గానూ.. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. మూడో సెషన్‌ పరీక్షల్ని ఏప్రిల్‌ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సెషన్‌ను వాయిదా వేసేందుకు నిర్ణయించాం. కొత్త తేదీల్ని పరీక్ష నిర్వహించడానికి కనీసం 15 రోజుల ముందు తెలియజేస్తాం. పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఎన్‌టీఏ అభ్యాస్‌ యాప్‌ ద్వారా ఇంటి వద్దే ఉండి ప్రాక్టీస్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం’ అని ఎన్‌టీఏ ప్రకటనలో వెల్లడించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని