JNU Job Recruitment: జేఎన్‌యూలో 388 పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హతలివే..!

ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 10 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Published : 19 Feb 2023 15:28 IST

దిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనిర్సిటీ(JNU)లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 388 ఉద్యోగాల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. వర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, పీఆర్వోలు, సెక్షన్‌ ఆఫీసర్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ అటెండెంట్లు, ప్రైవేటు సెక్రటరీ, పర్సనల్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్లు, రీసెర్చి ఆఫీసర్‌, ఎడిటర్‌ పబ్లికేషన్‌, అసిస్టెంట్‌ లైబ్రీరియన్‌, ప్రొఫెషనల్‌ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్‌ అసిస్టెంట్‌, కుక్‌, మెస్‌ హెల్పర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌), జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌), లిఫ్ట్‌ ఆపరేటర్‌, సిస్టమ్‌ ఎనలిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌, లేబోరేటరీ అటెండెంట్‌, స్టాఫ్‌నర్స్‌, లేబోరేటరీ అసిస్టెంట్‌ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జేఎన్‌యూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

  • శనివారం (ఫిబ్రవరి 18) నుంచి దరఖాస్తుల ప్రక్రియ  మొదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 10వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
  • రాత పరీక్ష, ఆయా పోస్టులను బట్టి నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. 
  • రాత పరీక్ష 2గంటల పాటు ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులు ఉంటాయి. జనరల్‌ సైన్స్(30 మార్కులు)‌, రీజనింగ్‌ ఎబిలిటీ(35), మ్యాథమెటికల్‌ ఎబిలిటీ(35), టెస్ట్‌ ఆఫ్‌ లాంగ్వేజ్‌: ఇంగ్లిష్‌/హిందీ(30); కంప్యూటర్‌ అవగాహన(20) చొప్పున మార్కులు ఉంటాయి. 
  • ఈ ఉద్యోగ ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, పరీక్ష రుసుం, వయో పరిమితి ఇతర వివరాలన్నింటి కోసం క్లిక్‌ చేయండి 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని