Telangana News: వైద్యారోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 30 Dec 2022 17:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ వెలువడింది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో  5,204 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో డీఎంఈ, డీహెచ్‌ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌ జే సంస్థల్లో 81, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో 127, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ విభాగంలో 8, మహాత్మాజ్యోతిబా పూలే విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌లో 124, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని